మొదటి ప్రచురణకి రెండవ ప్రచురణకి మద్య ఇన్ని రోజులు ఖాళీ రావడానికి కారణాలు రెండు--
ఒకటి మా గృహము నందు కలన యంత్రాల అంతర్జాలం తీసివేయబడుట వలన మరియు రెండవది ఈ మధ్య నాకు రాయాలనే ఆసక్తి, రాయడానికి సమయము రెండూ కలసిరాకపోవడం వలన..
పైన రాసింది మీకు చదవడానికి, చదివి అర్ధం చేసుకోవడానికి ఎంత సేపు పడుతుందో తెలియదు కానీ రాయడం మాత్రం అంతసులభం కాదు. ..కావాలంటే మీరు కూడా ఏదైనా రెండువాక్యాలు రాయడానికి ప్రయత్నించండి తెలుగులో ఆంగ్ల పదం అనేది వాడకుండా....
తెలుగు రాష్ట్రం లో పుట్టి, తెలుగు వారి మద్యలో పెరిగి, తెలుగులో ఈమాత్రం ప్రావీణ్యం లేకపోవడానికి కారణాలు వెతకడం మొదలుపెడితే ...ఆసక్తి లేకపోవడమా, తెలుగు భాష నేర్చుకోవడం వలన ఉపయోగమేం లేదని భావించడం వలనా, ఆధునికమైన ఈ రోజుల్లోకూడా తెలుగులో మాట్లాడితే చిన్నతనంగా ఉంటుందనా, ఏదైతేనేం తెలుగు అంటే కష్టం ఇంగ్లీష్ అంటే ఇష్టం అనే పరిస్తితి ఏర్పడుతోంది .
నోట్: సగం రాసాక ఇప్పుడు నాకొక విషయం గుర్తుకు వచ్చింది...this post is mainly intended for telugu people who cant speak/read/write proper telugu or who doesnt want to s/r/w telugu language..so i will not try and use grandhika telugu (pure telugu) from now on since it makes no meaning for them who cant understand..please continue reading..
శ్రీకృష్ణదేవరాయులు వంటి గొప్ప రాజు.. (ఆయన మాతృభాష కన్నడ), "దేశ భాషలందు తెలుగు లెస్స" అని చెప్పారంటే తెలుగు గొప్పతనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు...
అయినా తెలుగు గొప్పతనం గురించి చెప్పడానికి నేను ఇదంతా రాయట్లేదు.. తెలుగు గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు , topic create చెయ్యొచ్చు అని చెప్పడానికి రాస్తున్నా.. ఎవరైనా friends ని relatives ని కలిసినప్పుడు movies, sports, politics గురించే కాకుండా మన తెలుగు గురించి తెలుగు సంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవడానికి, మాట్లాడటానికి try చెయ్యండి.
హిందీ, ఇంగ్లీష్ రాని వాళ్లు కూడా వచ్చీ రాని ఆ భాషల్లో మాట్లాడటానికి interest చూపిస్తున్నారు కానీ మన మాతృ భాష తెలుగు improve చేస్కోవడానికి try చెయ్యట్లేదు...
Already తెలంగాణా తెలుగు రాయలసీమ తెలుగు గోదావరి జిల్లాల తెలుగు అని తెలుగు ని ముక్కలు ముక్కలు చేసి 50 % చంపేశారు.. మిగిలి ఉన్న తెలుగుని కూడా కాపాడుకోకపోతే next generations కి తెలుగు అంటే ఒక ancient language గా మిగిలిపోతుందేమో..(recently telugu కి ప్రాచీన హోదా కల్పించారు..దానికర్ధం ఇదేనా..??)
అప్పటికీ సినిమాల్లో అడపాదడపా తెలుగు గొప్పతనం గురించి పాటలు, మాటలు వస్తూనే ఉన్నాయి ...ఈమాత్రం తెలుగు ఉందంటే ఒకరకంగా అది print media , సినిమాల వలన కావొచ్చు..అయినా కూడా జనం లో మాత్రం మార్పు లేదు..అర్ధం కానట్టు, అర్ధం చేసుకోవడం ఇష్టం లేనట్టు చూసి, విని వదిలేస్తున్నారు.
నేనేదో తెలుగులో పండితుడిని, ఉద్దరించేస్తున్నా అనే feeling tho ఇదంతా చెప్పట్లేదు..atleast ఇద్దరు మాట్లాడుకునేప్పుడు ఇద్దరికీ తెలుగు వచ్చినపుడు తెలుగులోనే మాట్లాడటానికి ట్రై చెయ్యండి..తెలుగులో లేని పదాల కోసం ట్రై చెస్తూ comedy create చెయ్యకుండా తెలుగు తెలుగులా ఉంచడానికి ట్రై చెయ్యండి ..ఉనికిని విలువ ని కాపాడండి..
మొత్తం చివర వరకు ఓపికతో చదివినందుకు many thanks..అలాగే comment చేయడం మర్చిపోవద్దు..తప్పు ఉంటే తప్పు అని చెప్పండి తప్పు లేదు..నాకు కూడా అది తప్పు అనిపిస్తే సరి చేసుకుంటా...
Glossary::
కలన యంత్రాల అంతర్జాలం అంటే internet(source-http://www.sahiti.org/dict/index.jsp?engWord=internet)
--శ్రీకాంత్...